కుడి కంటి చూపు కోల్పోయిన ఇమ్రాన్
ABN , Publish Date - Feb 13 , 2026 | 06:05 AM
సుమారు మూడేళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తీవ్ర అనారోగ్య సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆయన దాదాపుగా...
చికిత్స చేయించాలని సుప్రీంకోర్టు ఆదేశం
ఇస్లామాబాద్, ఫిబ్రవరి 12: సుమారు మూడేళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తీవ్ర అనారోగ్య సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆయన దాదాపుగా కుడి కంటి చూపును కోల్పోయారు. కోర్టు మిత్రునిగా వ్యవహరించిన బారిస్టర్ సల్మాన్ సఫ్దర్ సుప్రీంకోర్టుకు గురువారం సమర్పించిన నివేదికలో ఈ విషయం వెల్లడయింది. ఆయన కుడి కన్ను 85ు మేర పనిచేయడం లేదని వైద్య పరీక్షల్లో తేలింది. గత ఏడాది అక్టోబరులో జరిగిన పరీక్షల్లో రెండు కళ్లూ సాధారణ పరిస్థితుల్లో ఉండడం గమనార్హం. ఖైదీల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్న చీఫ్ జస్టిస్ యాహ్యా అఫ్రిది.. సోమవారం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.