తుపాకీని వదిలి గిరిజనుల హక్కుల కోసం.. ఉద్యోగిగా మారిన మాజీ మావోయిస్టు మల్లోజుల
ABN , Publish Date - Sep 02 , 2026 | 06:33 AM
మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఒకరైన మల్లోజుల వేణుగోపాల్ ఉద్యోగిగా మారారు. గతేడాది అక్టోబరులో మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన మల్లోజుల ఆయుధాన్ని వీడిన తర్వాత గిరిజన గ్రామాల ప్రజల హక్కులు కాపాడే ఉద్యోగం పొందారు
గడ్చిరోలి, సెప్టెంబరు 1: మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఒకరైన మల్లోజుల వేణుగోపాల్ ఉద్యోగిగా మారారు. గతేడాది అక్టోబరులో మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన మల్లోజుల ఆయుధాన్ని వీడిన తర్వాత గిరిజన గ్రామాల ప్రజల హక్కులు కాపాడే ఉద్యోగం పొందారు. మహారాష్ట్ర, గడ్చిరోలిలోని గోండ్వానా విశ్వవిద్యాలయం ‘ఏకల్’ కార్యక్రమం కో-ఆర్డినేటర్‌గా కాంట్రాక్టు ఉద్యోగిగా నియమితులయ్యారు. ఏకల్ కార్యక్రమంలో భాగంగా కో-ఆర్డినేటర్లు పెసా(పంచాయత్ ఎక్స్‌టెన్షన్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియా) చట్టం, అటవీ హక్కుల చట్టం కింద లభించే హక్కులపై గిరిజనలను చైతన్యవంతం చేయడం, గ్రామసభల నిర్వహణ వంటి బాధ్యతలు నిర్వర్తిస్తారు. మూడు నెలల కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగం పొందిన మల్లోజులకు నెలకు రూ.30,000 గౌరవవేతనం అందనుంది.