Share News

మన చట్టాలకు విరుద్ధంగా ఉంటేనే విదేశీ విడాకులు భారత్‌లో చెల్లవు!

ABN , Publish Date - Nov 13 , 2026 | 02:27 AM

భారతీయ చట్టాలకు విరుద్ధంగా విదేశాల్లోని కోర్టులు ఇచ్చే విడాకులు భారత్‌లో చెల్లవని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని సేవ్‌ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్‌ సభ్యుడు ఆనందబాబు తెలిపారు.

మన చట్టాలకు విరుద్ధంగా ఉంటేనే విదేశీ విడాకులు భారత్‌లో చెల్లవు!

  • సేవ్‌ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్‌ వెల్లడి

హైదరాబాద్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): భారతీయ చట్టాలకు విరుద్ధంగా విదేశాల్లోని కోర్టులు ఇచ్చే విడాకులు భారత్‌లో చెల్లవని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని సేవ్‌ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్‌ సభ్యుడు ఆనందబాబు తెలిపారు. ‘విదేశీ కోర్టులు ఇచ్చిన ప్రతి విడాకులు భారత్‌లో చెల్లవు’ అనే అర్థం వచ్చేలా పత్రికల్లో కథనాలు వచ్చాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో విదేశాల్లో నివసించే భారతీయుల్లో కొంత గందరగోళం నెలకొందన్నారు. విదేశాల్లోని కోర్టులు ఇచ్చిన విడాకులు భారతీయ చట్టాలకు అనుగుణంగా లేకపోతే మాత్రమే.. ఆ విడాకులు ఇవ్వడానికి చెప్పిన కారణాలు భారత్‌లోని వ్యక్తిగత చట్టాల్లో లేని సందర్భాల్లో మాత్రమే చెల్లవని వివరించారు. విదేశీ కోర్టు ఇచ్చిన విడాకుల డిక్రీ భారత్‌లో అమల్లో ఉన్న సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీపీసీ) సెక్షన్‌ 13 నిబంధనలకు లోబడి ఉండాలని.. ఆ నిబంధనల ప్రకారం ఉంటే ఆ విడాకులు భారత్‌లో చెల్లుతాయని ఆయన తెలిపారు.

Updated Date - Nov 13 , 2026 | 02:29 AM