‘డాక్ సేవా గిఫ్ట్స్’ అంటూ వచ్చే మెసేజ్‌లు నకిలీవి
ABN , Publish Date - Jun 01 , 2026 | 04:02 AM
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ‘డాక్ సేవా గిఫ్ట్స్’ మెసేజ్ మోసపూరితమైనదని, దీంతో ఇండియా పోస్ట్ ఆఫీసుకు ఎలాంటి సంబంధం ...
న్యూఢిల్లీ, మే 31: సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ‘డాక్ సేవా గిఫ్ట్స్’ మెసేజ్ మోసపూరితమైనదని, దీంతో ఇండియా పోస్ట్ ఆఫీసుకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలాంటి అనుమానాస్పద లింక్‌లు లేదా వెబ్‌పేజీలను క్లిక్ చేయవద్దని, సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని దేశ పౌరులను కోరింది. ‘ఇండియా పోస్ట్’ బహుమతులు, రివార్డులు ఇస్తోందని పేర్కొంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డాక్ సేవా గిఫ్ట్స్ మెసేజ్‌ను ది ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ శనివారం గుర్తించింది. ఒక ఆఫర్ ఉందని, దీన్ని అందుకోవాలంటే లింక్‌పై క్లిక్ చేయాలని లేదా వ్యక్తిగత సమాచారం ఇవ్వాలని నెటిజెన్లను ఆకర్షించేలా ఈ మెసేజ్ ఉంది. ఇది పూర్తిగా అవాస్తవమని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ధ్రువీకరించింది.