Share News

ఎక్స్‌ప్రెస్‌వేలపై 120 కి.మీ వేగానికి నో ఫైన్‌

ABN , Publish Date - Oct 30 , 2026 | 03:12 AM

దేశంలోని ఎక్స్‌ప్రె్‌సవేలపై వేగ పరిమితులు, ట్రాఫిక్‌ చలాన్లపై కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కీలక ప్రకటన చేశారు.

ఎక్స్‌ప్రెస్‌వేలపై 120 కి.మీ వేగానికి నో ఫైన్‌

  • మరో 20శాతం వరకూ మినహాయింపు

  • ఈ మేరకు అధికారులకు ఆదేశాలిచ్చాం

  • కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడి

న్యూఢిల్లీ, అక్టోబరు 29: దేశంలోని ఎక్స్‌ప్రె్‌సవేలపై వేగ పరిమితులు, ట్రాఫిక్‌ చలాన్లపై కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. వాహనాలు ఎక్స్‌ప్రె్‌సవేలపై గంటకు 120 కిలోమీటర్ల వరకూ వేగంతో ప్రయాణించినా చలాన్లు వేయొద్దని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నిర్ణీత వేగం కంటే 20శాతం వరకూ ఎక్కువ వేగంతో వెళ్లినా మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే అంత కంటే ఎక్కువ వేగంతో వాహనాలను నడిపితే జరిమానాలు విధించాలని ఆదేశించామన్నారు. భారతీయ హైవేల భవిష్యత్తుపై సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ ఈ అధికారిక ఆదేశాలను వెల్లడించారు. ఢిల్లీ-ముంబై వంటి ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణించే వాహనాల డ్రైవర్లకు జారీ అయ్యే అనవసర స్పీడింగ్‌ నోటీసుల సమస్యను తగ్గించే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఆయా ఎక్స్‌ప్రె్‌సవేలపై వేగ పరిమితి ప్రస్తుతం గంటకు 100-120 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. ‘‘స్పీడ్‌ కారణంగా కొంత మంది నోటీసులు అందుకుంటున్నారు. గంటకు 120 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వారికి ఎలాంటి నోటీసులు జారీచేయవద్దని అ ధికారులను ఆదేశిం చాం. 120 కిలోమీటర్లకు మించి 20ు దాటినా మినహాయిస్తున్నాం. అయితే అంతకంటే వేగం దాటితే.. చలాన్లు వేయాలని సూచించాం’’ అని తెలిపారు. దీని ప్రకారం 120 కిలోమీటర్లు వేగపరిమితి ఉన్న రహదారిపై గంటకు 144 కిలోమీటర్ల వేగం వరకూ చలాన్ల పడవు.

Updated Date - Oct 30 , 2026 | 03:13 AM