Share News

ఎవరెస్ట్‌ జీలకర్ర పొడి ప్యాకెట్లను మార్కెట్‌ నుంచి రీకాల్‌ చేయండి: ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ

ABN , Publish Date - Oct 05 , 2026 | 05:46 AM

మార్కెట్‌లో ఎవరెస్ట్‌ జీలకర్ర పొడి ప్యాకెట్లను విక్రయించకూడదని, వాటిని వెంటనే వెనక్కి తీసుకురావాలని(రీకాల్‌ చేయాలని)..

ఎవరెస్ట్‌ జీలకర్ర పొడి ప్యాకెట్లను మార్కెట్‌ నుంచి రీకాల్‌ చేయండి: ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ

న్యూఢిల్లీ, అక్టోబరు 4: మార్కెట్‌లో ఎవరెస్ట్‌ జీలకర్ర పొడి ప్యాకెట్లను విక్రయించకూడదని, వాటిని వెంటనే వెనక్కి తీసుకురావాలని(రీకాల్‌ చేయాలని) ఎవరెస్ట్‌ ఫుడ్‌ ప్రాడక్ట్స్‌ కంపెనీని ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ ఆదేశించింది. నమూనాలను పరీక్షించినప్పుడు వినియోగానికి అనువుగా లేదని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆదివారం సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపింది. వాపసు తెచ్చిన ప్యాకెట్ల రికార్డును కూడా సమర్పించాలని ఆదేశించింది. దీనిని తయారు చేసే క్రియెటివ్‌ బేకర్స్‌ అండ్‌ కన్ఫెక్షనర్స్‌ లైసెన్స్‌ను తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నట్టు పేర్కొంది. గోవాలోని రివర్‌సైడ్‌ రిసార్ట్స్‌ అండ్‌ హాలిడే హోమ్స్‌లో సేకరించిన జీలకర్ర పొడి నమూనాను పరీక్షించినప్పుడు దాంట్లో పరిమితులకు మించి అజోక్సైస్ట్రోబిన్‌, థియొమెథాక్సాం వంటి పురుగుమందు అవశేషాలు ఉన్నట్టు తేలింది.

Updated Date - Oct 05 , 2026 | 05:48 AM