Share News

ఇథనాల్‌ బ్లెండింగ్‌తో చికెన్‌ ధరలకు రెక్కలు!

ABN , Publish Date - Oct 03 , 2026 | 03:11 AM

పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడం, వర్షాభావ పరిస్థితుల వల్ల రాబోయే రోజుల్లో కోడిగుడ్లు, చికెన్‌ ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది

ఇథనాల్‌ బ్లెండింగ్‌తో చికెన్‌ ధరలకు రెక్కలు!

న్యూఢిల్లీ, అక్టోబరు 2: పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడం, వర్షాభావ పరిస్థితుల వల్ల రాబోయే రోజుల్లో కోడిగుడ్లు, చికెన్‌ ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ప్రస్తుతం దేశంలో ఇథనాల్‌ ఉత్పత్తిలో మొక్కజొన్న వాటా 37శాతం. కేంద్రం మొక్కజొన్న నుంచి ఇథనాల్‌ తయారీని బాగా ప్రోత్సహిస్తోంది. మరోవైపు, కోళ్ల దాణాలో మొక్కజొన్న కీలకమైనది. దాణాలో 60శాతం మొక్కజొన్ననే వాడుతున్నారు. అయితే, మొక్కజొన్నను ఇథనాల్‌ కోసం ఎక్కువగా కొనుగోలు చేస్తుండటంతో డిమాండ్‌ బాగా పెరిగింది. ఇంకోవైపున ఎల్‌నినో వల్ల మొక్కజొన్న దిగుబడి పడిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల మొక్కజొన్న ధర పెరిగి, దీంతో దాణా ఖర్చు పెరిగి, గుడ్డు, చికెన్‌ ధరలు 60శాతం కంటే ఎక్కువగా పెరగవచ్చని పౌల్ట్రీ వర్గాల అంచనా.

Updated Date - Oct 03 , 2026 | 03:16 AM