ఈపీఎఫ్‌వో అన్‌క్లెయిమ్డ్ ఖాతాల నుంచినేరుగా బ్యాంకు అకౌంట్లో సొమ్ము జమ
ABN , Publish Date - Feb 24 , 2026 | 04:12 AM
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ చందాదారులకు కేంద్ర ప్రభుత్వం మరో ప్రయోజనాన్ని కలిగించనుంది. ఎవరూ క్లెయిమ్ చేయని మొత్తాలను సంబంధిత ఖాతాదారుల బ్యాంకు అకౌంట్లలో ఆటోమేటిక్‌గా జమ...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ చందాదారులకు కేంద్ర ప్రభుత్వం మరో ప్రయోజనాన్ని కలిగించనుంది. ఎవరూ క్లెయిమ్ చేయని మొత్తాలను సంబంధిత ఖాతాదారుల బ్యాంకు అకౌంట్లలో ఆటోమేటిక్‌గా జమ చేయాలని నిర్ణయించింది. తొలుత రూ.1000లోపు నిల్వ ఉన్న చిన్న ఖాతాలకే ఇది వర్తిస్తుంది. వరుసగా మూడేళ్లపాటు సొమ్ము జమ చేయడంగానీ, విత్‌డ్రా చేయడంగానీ జరగని ఖాతాలను మురిగిపోయిన ఖాతాలుగా పరిగణించనుంది. వాటిల్లో నిల్వ ఉన్న సొమ్మును నేరుగా ఖాతాదారుల అకౌంట్లలో జమ కానుంది. మొత్తం 31.85 లక్షల ఖాతాలు నిర్వహణలో లేవని ఈపీఎ్‌ఫఓ గుర్తించింది. వీటిలో రూ.10,903 కోట్లు ఉన్నట్టు అంచనా. బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేసి ఉంటే, ఈపీఎ్‌ఫఓ వద్ద ఉన్న వివరాలు ఆధారంగా ఎలాంటి క్లెయిమ్ సెటిల్‌మెంట్ పత్రాలు అవసరం లేకుండానేఈ సొమ్ము నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.