Share News

3 రోజుల పాటు పీఎఫ్‌ పోర్టల్‌ బందు

ABN , Publish Date - Jun 26 , 2026 | 03:54 AM

సాంకేతిక పరిజ్ఞానం ఉన్నతీకరణ నిమిత్తం తన అధికారిక పోర్టల్‌ను ఈ నెల 26 నుంచి 28 వరకు బంద్‌ చేయనున్నట్టు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ....

3 రోజుల పాటు పీఎఫ్‌ పోర్టల్‌ బందు

న్యూఢిల్లీ. జూన్‌25: సాంకేతిక పరిజ్ఞానం ఉన్నతీకరణ నిమిత్తం తన అధికారిక పోర్టల్‌ను ఈ నెల 26 నుంచి 28 వరకు బంద్‌ చేయనున్నట్టు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ప్రకటించింది. దాంతో ఈ మూడు రోజుల పాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడంతో పాటు, ఇతర కార్యకలాపాలన్నీ నిలిచిపోనున్నాయి. గురువారం అర్ధరాత్రి బంద్‌ అయిన ఈ పోర్టల్‌ తిరిగి సోమవారం నుంచి పనిచేయడం ప్రారంభిస్తుంది. ఏటీఎంల ద్వారా పీఎఫ్‌ నిధిలో 75శాతం వరకు విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని అమలు చేయడం నిమిత్తం కూడా కొత్త సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టనుంది. యూపీఐ, ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఈ నెలాఖరు నుంచే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఇబ్బందులు తలెత్తితే హెల్ప్‌లైన్‌ నెంబరు 14470కు ఫోన్‌ చేయాలని వినియోగదారులకు ఈపీఎఫ్ఓ సూచించింది.

Updated Date - Jun 26 , 2026 | 03:54 AM