Share News

సరికొత్తగా పీఎఫ్‌ యూనిఫైడ్‌ పోర్టల్‌

ABN , Publish Date - Jul 05 , 2026 | 05:53 AM

ఆధునికీకరణ కోసం వారం రోజులపాటు ఖాతాదారులకు దూరమైన ఈపీఎ్‌ఫఓ యూనిఫైడ్‌ మెంబర్‌ పోర్టల్‌ సరికొత్తరూపుతో, అనేక మార్పులతో అందుబాటులోకి వచ్చింది.

సరికొత్తగా పీఎఫ్‌ యూనిఫైడ్‌ పోర్టల్‌

న్యూఢిల్లీ, జూలై 4: ఆధునికీకరణ కోసం వారం రోజులపాటు ఖాతాదారులకు దూరమైన ఈపీఎ్‌ఫఓ యూనిఫైడ్‌ మెంబర్‌ పోర్టల్‌ సరికొత్తరూపుతో, అనేక మార్పులతో అందుబాటులోకి వచ్చింది. ఖాతాదారులకు నమ్మకమైన, వేగవంతమైన సేవలను అందించడమే లక్ష్యంగా ఈ అనేక మార్పులు చేసినట్లు సంస్థ పేర్కొంది. పోర్టల్‌ ద్వారా గతంలో యూఏఎన్‌ నంబరు యాక్టివేట్‌ చేసుకోవడానికి, జనరేట్‌ చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ సర్వీసును తీసేశారు. ప్రభుత్వ సర్వీసులను అందించే ఉమాంగ్‌ యాప్‌లో ఆ సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు. ఆధార్‌ ఆధారిత ఫేస్‌ ఆథెంటికేషన్‌ ద్వారా ఆ రెండు సేవలను పొందవచ్చు. యూఏఎన్‌ నంబరు మర్చిపోతే దానిని తిరిగిపొందడం సరికొత్త పోర్టల్‌ చాలా సులభం. రిజిస్టర్‌ మొబైల్‌ నంబరు, వ్యక్తిగత వివరాలు దగ్గర ఉంటే చాలు. ఈపీఎ్‌ఫఓ సభ్యుడు మరణిస్తే దానిని క్లెయిమ్‌ చేసే అవకాశం పోర్టల్‌లో అందుబాటులో ఉంది. పోర్టల్‌లో మార్పులు చేసిన తరువాత క్లెయిమ్స్‌, ఆన్‌లైన్‌ అభ్యర్థనల పరిష్కారానికి మరో రెండువారాలపాటు ఎక్కువ సమయం తీసుకుంటుందని, పీక్‌ అవర్స్‌లో ఒకే అభ్యర్థనను పదేపదే చేయవద్దని సంస్థ సభ్యులకు సూచించింది.

Updated Date - Jul 05 , 2026 | 05:53 AM