Share News

అసంఘటిత కార్మికులకూ ఈపీఎ్‌ఫ, ఈఎస్ఐ!

ABN , Publish Date - Mar 31 , 2026 | 04:53 AM

దేశంలోని అసంఘటిత రంగ కార్మికులకు కూడా ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎ్‌ఫవో), ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌....

అసంఘటిత కార్మికులకూ ఈపీఎ్‌ఫ, ఈఎస్ఐ!

  • పరిశీలిస్తున్నామని లోక్‌సభలో కేంద్రం వెల్లడి

న్యూఢిల్లీ, మార్చి 30: దేశంలోని అసంఘటిత రంగ కార్మికులకు కూడా ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎ్‌ఫవో), ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్ఐసీ) వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలను కల్పించేందుకు పరిశీలిస్తున్నామని కేంద్రం తెలిపింది. అలాగే అసంఘటిత రంగ కార్మికులకు పింఛన్‌ సదుపాయం కల్పించేందుకు కార్మికశాఖలో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని వెల్లడించింది. ఈ మేరకు సోమవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే సమాధానమిచ్చారు.మరిన్ని వర్గాల కార్మికులను క్రమంగా అధికారిక సామాజిక భద్రతా వ్యవస్థల్లో చేర్చడానికి ప్రయత్నాలు జరగుతున్నాయని చెప్పారు.

Updated Date - Mar 31 , 2026 | 04:53 AM