త్వరలో పీఎఫ్ రిటైర్మెంట్ ఫండ్ కూడా ‘ఆటో విత్‌డ్రా’
ABN , Publish Date - May 14 , 2026 | 04:55 AM
ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) ఫైనల్ సెటిల్‌మెంట్ రూ.5లక్షల లోపు ఉంటే ఆ డబ్బును ఆటో-మోడ్ విధానంలో చెల్లించేలా...
న్యూఢిల్లీ, మే 13: ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) ఫైనల్ సెటిల్‌మెంట్ రూ.5లక్షల లోపు ఉంటే ఆ డబ్బును ఆటో-మోడ్ విధానంలో చెల్లించేలా ఈపీఎ్‌ఫవో చర్యలు తీసుకుంటోంది. ఆటో-మోడ్ విధానం అంటే పీఎఫ్ ఖాతాలోని డబ్బును తీసుకోవడానికి ఆన్‌లైన్‌లో పీఎఫ్ పోర్టల్ ద్వారా అప్లై చేస్తే ఆ డబ్బు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. మానవ ప్రమేయం ఉండదు. ప్రస్తుతం ఈ విధానం అడ్వాన్స్ క్లెయిమ్‌లకు(విద్య కోసం, ఇల్లు కట్టుకోవడం కోసం, అనారోగ్య సమస్యలు ఉంటే పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకోవడం) మాత్రమే వర్తిస్తోంది. దీన్ని ఇప్పుడు ఫైనల్ సెటిల్మెంట్‌కు కూడా విస్తరించనున్నారు. కొత్త కార్మిక చట్టాలపై ఢిల్లీలో అసోచామ్ నిర్వహించిన నేషనల్ సెమినార్‌లో సెంట్రల్ పీఎఫ్ కమిషనర్ రమేశ్ కృష్ణమూర్తి ఈ విషయాన్ని వెల్లడించారు. ఆటో-మోడ్ విధానంలో ఫైనల్ సెటిల్మెంట్ కూడా 3-4రోజుల్లో పూర్తి అవుతుందన్నారు. ఇకపై ఎవరైనా ఉద్యోగి కంపెనీ మారితే, పాత పీఎఫ్ ఖాతాను కొత్త ఖాతాలో విలీనం చేయడానికి ఎలాంటి ఫారాలు నింపాల్సిన అవసరం లేదని, ఆటోమేటిక్‌గా విలీనం అవుతాయని ఆయన పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్