ఓట్ల శాతం ఆధారంగా పార్టీలకు ప్రాతినిధ్యం ఉండాలి: ఎస్‌వై ఖురేషీ
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:14 AM
ఎన్నికల్లో పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం ప్రాతిపదికన కూడా పార్లమెంట్‌లో సీట్లు ఉండాలని కేంద్ర మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ వై ఖురేషి అభిప్రాయపడ్డారు.
చెన్నై, జనవరి 23: ఎన్నికల్లో పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం ప్రాతిపదికన కూడా పార్లమెంట్‌లో సీట్లు ఉండాలని కేంద్ర మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ వై ఖురేషి అభిప్రాయపడ్డారు. దీనికోసం దేశంలో మిశ్రమ ఎన్నికల విధానాన్ని తెచ్చే దిశగా ఆలోచన చేయాలని సూచించారు. ప్రతి ఓటరుకు రెండు ఓట్లు ఇవ్వాలని, ఒకటి పార్టీకి, రెండోది అభ్యర్థికి ఇవ్వాలన్నారు. దీనికి అనుగుణంగా లోక్‌సభ సీట్ల సంఖ్యను 543 నుంచి 800 పెంచాలన్నారు. ‘‘2014 సాధారణ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీకి 20ు ఓట్లు వచ్చాయి. అయినా ఆ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది, అంటే 20ు ఓటర్లు మద్దతు పలికిన పార్టీకి లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది’’ అని ఖురేషి చెప్పారు. ఇది ఆ 20శాతం మంది ఓట్లకు విలువ లేకుండా చేయడమేనని అన్నారు.