రెండు సార్లు వెనక్కి మళ్లి.. ముంబై, దుబాయ్ విమానానికి అరుదైన పరిస్థితి
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:26 AM
పశ్చిమాసియాలో యుద్థ పరిస్థితులతో ఎమిరేట్స్ విమానం అరుదైన పరిస్థితి ఎదుర్కొంది. ముంబై నుంచి మంగళవారం ఉదయం దుబాయికి ....
న్యూఢిల్లీ, మార్చి 3: పశ్చిమాసియాలో యుద్థ పరిస్థితులతో ఎమిరేట్స్ విమానం అరుదైన పరిస్థితి ఎదుర్కొంది. ముంబై నుంచి మంగళవారం ఉదయం దుబాయికి బయలుదేరిన విమానం గగనతలంలో రెండుసార్లు వెనక్కి మళ్లి.. ఎట్టకేలకు ఎయిర్‌పోర్టులో దిగింది. ‘ఫ్లైటారాడార్ 24’ డేటా మేరకు.. ఈకే501 విమానం యూఏఈ గగనతలం వెలుపల నుంచి వెనక్కి తిరిగింది. యూఏఈపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేస్తోందన్న హెచ్చరికలతో ఆ విమానానికి క్లియరెన్స్ రాలేదు. దీంతో ఆ విమానం ముంబైకి మళ్లి కొద్ది ేసపటి తర్వాత దుబాయ్ వైపు తిరిగింది. తర్వాత మరోసారి ముంబైకి మళ్లగా, దుబాయ్ ఎయిర్‌పోర్టు అధికారుల నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో క్షేమంగా ఎయిర్‌పోర్టులో దిగింది.