1.25 కోట్ల మంది ఓటర్ల పేర్లపై అభ్యంతరాలు
ABN , Publish Date - Jan 25 , 2026 | 02:49 AM
ఓటర్ల నమోదు విషయంలో పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ రూపొందించిన జాబితాను ఎన్నికల కమిషన్ శనివారం వెబ్‌సైట్‌లో పెట్టింది.
కోల్‌కతా, జనవరి 24: ఓటర్ల నమోదు విషయంలో పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ రూపొందించిన జాబితాను ఎన్నికల కమిషన్ శనివారం వెబ్‌సైట్‌లో పెట్టింది. పేరు నమోదుకు సంబంధించి ‘తార్కిక లోపాలు’ ఉన్నాయంటూ ఆ జాబితాను తయారు చేసింది. మొత్తం 1.25 కోట్ల మంది ఓటర్ల పేర్లపై అభ్యంతరాలను వ్యక్తం చేసింది. వీటిని ఆయా జిల్లాల కలెక్టర్లు పంచాయతీ, వార్డు కార్యాలయాల వద్ద ప్రదర్శించాల్సి ఉంటుంది. ఓటర్ల నుంచి వివరణలు తీసుకొని సవరించాల్సి ఉంటుంది.