Share News

ఇక పోలీసు పర్యవేక్షకుల సమక్షంలో రాష్ట్ర పోలీసు సిబ్బందికి విధుల అప్పగింత

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:42 AM

ఇకపై పోలింగ్‌ రోజున పోలింగ్‌ కేంద్రాల వద్ద విధుల్లో ఉండే రాష్ట్ర పోలీసు సిబ్బందిని నియోజకవర్గాల్లో విధుల్లో ఉన్న కేంద్ర పోలీసు పరిశీలకుల సమక్షంలో ఎవరిని ఎక్కడికి ...

ఇక పోలీసు పర్యవేక్షకుల సమక్షంలో రాష్ట్ర పోలీసు సిబ్బందికి విధుల అప్పగింత

  • ఓటింగ్‌ విధుల్లో ఉండే వారికి సంబంధించి ఈసీ ఆదేశం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ఇకపై పోలింగ్‌ రోజున పోలింగ్‌ కేంద్రాల వద్ద విధుల్లో ఉండే రాష్ట్ర పోలీసు సిబ్బందిని నియోజకవర్గాల్లో విధుల్లో ఉన్న కేంద్ర పోలీసు పరిశీలకుల సమక్షంలో ఎవరిని ఎక్కడికి పంపాలో (ర్యాండమైజేషన్‌) నిర్ణయించాలని ఎన్నికల సంఘం(ఈసీ) ఆదేశించింది. పారదర్శకతను పెంచే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పక్షపాత ధోరణిని నివారించేందుకు స్థానిక పోలీసులను వారి ప్రస్తుత స్టేషన్‌ ప్రాంతాలకు వెలుపల విధులు అప్పగించనున్నారు. భవిష్యత్తులో జరిగే అన్ని లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ రోజు పోలింగ్‌ కేంద్రంలో మోహరించే రాష్ట్ర పోలీసు సిబ్బందిని ఆ జిల్లాలోని నియోజకవర్గాల్లోని పోలీసు పరిశీలకుల సమక్షంలో ఎవరు ఎక్కడకు వెళ్లాలో నిర్ణయిస్తారని సోమవారం రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు, డీజీపీలకు పంపిన లేఖలో ఈసీ పేర్కొంది.

Updated Date - Feb 25 , 2026 | 12:42 AM