ఎల్‌నినోతో 111 జిల్లాలకు తీవ్ర ముప్పు
ABN , Publish Date - Jun 24 , 2026 | 03:35 AM
ఎల్‌నినో కారణంగా నైరుతి రుతుపవనాల సీజన్‌లో వర్షాలు ముఖం చాటేశాయి. ఇప్పటి వరకూ 43ు లోటు వర్షపాతం నమోదైంది. జూలై 2వరకూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని...
న్యూఢిల్లీ, జూన్ 23: ఎల్‌నినో కారణంగా నైరుతి రుతుపవనాల సీజన్‌లో వర్షాలు ముఖం చాటేశాయి. ఇప్పటి వరకూ 43ు లోటు వర్షపాతం నమోదైంది. జూలై 2వరకూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఖరీ్‌ఫలో పంట నష్టానికి అత్యంత తీవ్రంగా గురయ్యే 111 జిల్లాలను ప్రభుత్వం గుర్తించిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ తెలిపారు. ఏపీ, తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, బిహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లోని 315 జిల్లాల్లో సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ గుర్తించింది. వీటిలో 25ు కంటే తక్కువ నీటి సదుపాయం ఉన్న 111 జిల్లాల్లో అత్యంత దుర్భర పరిస్థితులు ఉంటాయని వర్గీకరించింది. ఈ నేపథ్యంలో వర్షపాత లోటు పరిస్థితులకు అనువైన ప్రత్యామ్నాయ పంటలను సిఫారసు చేసింది.