ఎల్‌నినోతో భారత్‌లో 55 వేల మరణాలు!
ABN , Publish Date - Oct 30 , 2026 | 02:36 AM
ఎల్‌నినో కారణంగా పెరిగిపోనున్న వాతావరణ ఉష్ణోగ్రతలతో భారత్‌లో ఈ ఏడాది అక్టోబరు నుంచి వచ్చే ఏడాది మార్చిలోపు 55 వేల మంది మరణించే ప్రమాదం ఉందని..
అక్టోబరు-మార్చి మధ్య సంభవించే ప్రమాదం
ప్రపంచవ్యాప్తంగా 3,73,000 మంది
ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు..‘క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్’ వెల్లడి
న్యూఢిల్లీ, అక్టోబరు 29: ఎల్‌నినో కారణంగా పెరిగిపోనున్న వాతావరణ ఉష్ణోగ్రతలతో భారత్‌లో ఈ ఏడాది అక్టోబరు నుంచి వచ్చే ఏడాది మార్చిలోపు 55 వేల మంది మరణించే ప్రమాదం ఉందని అమెరికాకు చెందిన వాతావరణ అధ్యయన సంస్థ ‘క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్’ హెచ్చరించింది. ఇదే వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 3,73,000 మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. ‘ఎల్‌నినో హీట్ మోర్టాలిటీ ట్రాకర్’ పేరుతో ఈ వివరాలను వెల్లడించింది. గతనెల నాటికే పసిఫిక్ సముద్రంలో ఉష్ణోగ్రతలు 3.08డిగ్రీల సెల్సియస్ మేర పెరిగాయని, ఏ ఎల్‌నినోతోనూ ఈ స్థాయిలో పెరగలేదని క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ఎల్‌నినోను సూపర్ ఎల్‌నినోగా వాతావరణ నిపుణులు అభివర్ణిస్తున్నారు. తాజా అంచనాలపై క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ సహ వ్యవస్థాపకుడు మైఖేల్ గ్రీన్‌స్టోన్ మాట్లాడుతూ.. విపరీతమైన ఉష్ణోగ్రత ల ప్రభావం ప్రపంచంలో ఏ ప్రాంతంలోని ప్రజలమీద ఎక్కువగా ఉం టుందో తెలియజేస్తే, ఆయా ప్రాంతాల ప్రభుత్వాలు ముందుగానే జాగ్రత్త లు తీసుకోవటానికి వీలవుతుందన్నారు. కాగా, క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ ప్రకారం.. ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా దక్షిణార్థగోళంపైనే ఉండనుంది. భారత్‌లో ఎక్కువ మరణాలు మార్చిలో సంభవించే ప్రమాదం ఉంది.