బలపడుతున్న ఎల్‌నినో!
ABN , Publish Date - Nov 15 , 2026 | 02:29 AM
ఎల్‌నినో మరింత బలపడుతోంది. 2027 తొలి త్రైమాసికంలో ఇది చాలా బలమైనదిగా కొనసాగనుందని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని..
మార్చి దాకా ప్రభావ తీవ్రత
1950 తర్వాత అత్యంత బలమైనది: ఎన్‌ఓఏఏ
న్యూఢిల్లీ, నవంబరు 14: ఎల్‌నినో మరింత బలపడుతోంది. 2027 తొలి త్రైమాసికంలో ఇది చాలా బలమైనదిగా కొనసాగనుందని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఎన్‌ఓఏఏ(నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ర్టేషన్) తాజాగా వెల్లడించింది. ఎల్‌నినో బలపడుతూనే ఉందని, 1950 తర్వాత ఇదే అత్యంత బలమైనదిగా రికార్డులకు ఎక్కనుందని తెలిపింది. ఎల్‌నినో ప్రభావంతో భూమధ్య రేఖ వద్ద పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో గతంలోని అన్ని రికార్డులనూ బద్దలుకొట్టనున్నట్టు ఎన్‌ఓఏఏ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వర్షపాత పరిస్థితులను ఎల్‌నినో మార్చేస్తోంది. ఉష్ణోగ్రతలు, కార్చిచ్చు ఘటనలు పెరిగిపోతున్నాయి.