Share News

ప్లీజ్‌.. సాయం చేయండి

ABN , Publish Date - Mar 13 , 2026 | 03:48 AM

ఒమన్‌ సమీపంలో ఈ నెల 1న ఆయిల్‌ ట్యాంకర్‌ స్కై లైట్‌పై జరిగిన క్షిపణి దాడి నుంచి బయటపడిన ఎనిమిది మంది భారతీయ నావికులు ఇంకా ఒమన్‌లోనే చిక్కుకుపోయారు.

ప్లీజ్‌.. సాయం చేయండి

  • కేంద్రానికి 8 మంది నావికుల విజ్ఞప్తి

  • 12 రోజులుగా ఒమన్‌లో ఎదురుచూపులు

ముంబై, మార్చి 12: ఒమన్‌ సమీపంలో ఈ నెల 1న ఆయిల్‌ ట్యాంకర్‌ స్కై లైట్‌పై జరిగిన క్షిపణి దాడి నుంచి బయటపడిన ఎనిమిది మంది భారతీయ నావికులు ఇంకా ఒమన్‌లోనే చిక్కుకుపోయారు. క్షిపణి దాడిలో నౌకలో మంటలు చెలరేగడంతో వారి పాస్‌పోర్టులు, ఫోన్లు, గుర్తింపు కార్డులు, ఇతర డాక్యుమెంట్లు కాలిపోయాయి. దీంతో స్వదేశం రావడానికి అత్యవసర ప్రయాణ పత్రాల కోసం ఖసబ్‌ ఎయిర్‌పోర్టులో నిరీక్షిస్తున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి దాడి జరుగుతుందేమోననే భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని, ప్రాణాలతో సురక్షితంగా స్వదేశం తిరిగిరావడానికి సాయం చేయాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Updated Date - Mar 13 , 2026 | 03:48 AM