మార్చి 31లోగా 500 చార్జిషీట్లు దాఖలు చేయాలి
ABN , Publish Date - Feb 23 , 2026 | 01:37 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మనీ లాండరింగ్ కేసుల్లో 500 చార్జిషీట్లు దాఖలు చేయాలని ఈడీ లక్ష్యంగా పెట్టుకుంది. కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఏడాది లేదా ...
పెండింగ్ కేసులపై అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించిన ఈడీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మనీ లాండరింగ్ కేసుల్లో 500 చార్జిషీట్లు దాఖలు చేయాలని ఈడీ లక్ష్యంగా పెట్టుకుంది. కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఏడాది లేదా రెండేళ్లలో విచారణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు ఆదివారం ఈడీ వెల్లడించింది. సంక్లిష్ట అంశాలతో కూడిన కేసులకు ఈ గడువు నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. గతేడాది డిసెంబరు 19-21 తేదీల్లో అసోం రాజధాని గువహటిలో ఈడీ డైరెక్టర్ రాహుల్ నవీన్ అధ్యక్షతన జరిగిన జోనల్ ఆఫీసర్ల త్రైమాసిక సదస్సులో దీనిపై చర్చించి, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ‘‘పెండింగ్ కేసులను పూర్తి చేసేందుకు సరికొత్త లక్ష్యాలు, కాలపరిమితి విధించాం. దర్యాప్తు అధికారులకు అవసరమైన అధికారాలు ఇచ్చాం. సవాల్‌గా మారుతున్న డిజిటల్ అరెస్టు, సైబర్ నేరాలు, బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్ వంటి కేసులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించాం’’అని ఈడీ వెల్లడించింది.