Share News

ఈడీ ‘సూపర్‌ పోలీస్‌’ కాదు : కర్ణాటక హైకోర్టు

ABN , Publish Date - Nov 08 , 2026 | 02:45 AM

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నంజేగౌడ, ఆయన అనుచరులపై ఈడీ నమోదు చేసిన ఈసీఐఆర్‌ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌) కేసును హైకోర్టు కొట్టివేసింది.

ఈడీ ‘సూపర్‌ పోలీస్‌’ కాదు : కర్ణాటక హైకోర్టు

బెంగళూరు, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నంజేగౌడ, ఆయన అనుచరులపై ఈడీ నమోదు చేసిన ఈసీఐఆర్‌ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌) కేసును హైకోర్టు కొట్టివేసింది. తన దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని దర్యాప్తు చేసేందుకు ఈడీ ఏమీ ‘సూపర్‌ కాప్‌’ కాదని వ్యాఖ్యానించింది. కోలారు, చిక్కబళ్ళాపుర జిల్లాల పాల ఉత్పత్తిదారుల సమాఖ్య ఉద్యోగుల నియామకాల్లో అక్రమాలు, భూ ఆక్రమణలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది. 2023 నవంబరు 30న మాలూరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నంజేగౌడ నివాసంపైనా దాడులు నిర్వహించింది. దీంతో నంజేగౌడ తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా పీఎంఎల్‌ఏ విషయంలో ఈడీకి ఉన్న అధికారాలపై హైకోర్టు స్పష్టత ఇచ్చింది. ఒక నేరానికి సంబంధించి ప్రాథమిక దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసిన తరువాత మాత్రమే ఈడీ పాత్ర మొదలవుతుందని పేర్కొంది. ఈ కేసు విషయంలో అలాంటిది లేకపోయినా కేవలం మనీ లాండరింగ్‌ జరిగిందన్న అనుమానం, ఆరోపణల ఆధారంగా ఈడీ సుమోటోగా దర్యాప్తు చేయడం సరికాదని స్పష్టం చేసింది.

Updated Date - Nov 08 , 2026 | 02:47 AM