Share News

ఆడ్వాణీ, జైశంకర్‌, కేజ్రీవాల్‌కు ‘సర్‌’ నోటీసులు!

ABN , Publish Date - Sep 21 , 2026 | 04:48 AM

ఢిల్లీలో కొనసాగుతున్న ఓటరు ప్రక్రియలో భాగంగా పలువురు రాజకీయ ప్రముఖులకు, అధికారులకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఉపప్రధాని ఎల్‌.కె. ఆడ్వాణీతో పాటు విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఆయన సతీమణి కె.ఎస్‌. జైశంకర్‌, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, కేంద్ర ఎన్నికల కమిషనర్‌ ఎస్‌ఎస్‌ సంధూ వంటి ప్రముఖులకు ఈ నోటీసులు అందాయి

ఆడ్వాణీ, జైశంకర్‌, కేజ్రీవాల్‌కు ‘సర్‌’ నోటీసులు!
sir

  • ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, కేజ్రీవాల్‌,

  • ఎన్నికల కమిషనర్‌ ఎస్‌ఎస్‌ సంధూ,

  • విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీలకూ..

  • పాత రికార్డులతో సరిపోలకపోవడంతోనే

  • ప్రముఖులైనా, సామాన్యులైనా నిబంధనలు

ఒక్కటే.. ఎన్నికల సంఘం స్పష్టీకరణ

  • ఆడ్వాణీ, జైశంకర్‌, కేజ్రీవాల్‌కు ‘సర్‌’ నోటీసులు!

  • పాత రికార్డులతో సరిపోలకపోవడమే కారణం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: ఢిల్లీలో కొనసాగుతున్న ఓటరు ప్రక్రియలో భాగంగా పలువురు రాజకీయ ప్రముఖులకు, అధికారులకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఉపప్రధాని ఎల్‌.కె. ఆడ్వాణీతో పాటు విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఆయన సతీమణి కె.ఎస్‌. జైశంకర్‌, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, కేంద్ర ఎన్నికల కమిషనర్‌ ఎస్‌ఎస్‌ సంధూ వంటి ప్రముఖులకు ఈ నోటీసులు అందాయి. జాబితాలో ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, సీనియర్‌ పార్లమెంట్‌ సభ్యుడు కపిల్‌ సిబల్‌, కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వీ, విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ, న్యూఢిల్లీ ఎంపీ బాన్సురీ స్వరాజ్‌ల పేర్లు కూడా ఉన్నాయి. నోటీసు పొందిన వారిలో భారత ఆర్మీ మాజీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది దంపతులు, సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే, ప్రధాని ముఖ్య శాస్త్రీయ సలహాదారు అజయ్‌ కుమార్‌ సూద్‌, మత్స్యశాఖ కార్యదర్శి అభిలాక్ష్‌ లిఖి దంపతులు, ఫెర్టిలైజర్‌ కార్యదర్శి రజత్‌కుమార్‌ మిశ్రా భూవనరుల శాఖ కార్యదర్శి నరేంద్రభూషణ్‌ వంటి అగ్రశ్రేణి ఐఏస్‌ అధికారులు ఉన్నారు. ఓటర్ల రికార్డుల్లో పేర్ల స్పెల్లింగ్‌ వ్యత్యాసాలు ఉండటం, గత రికార్డులతో ప్రస్తుత ఓటర్ల వివరాలు సరిపోలక పోవడం వల్ల ఈ నోటీసులు జారీ అయినట్లు సమాచారం.


కాగా, నోటీసులు వెళ్లినంత మాత్రాన ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లను తొలగించినట్లు కాదని, ఓటర్ల డేటాలో ఉన్న చిన్నపాటి తప్పులను సరిదిద్దడానికి పంపిన సిస్టమ్‌ జనరేటెడ్‌ నోటీసులని ఈసీ స్పష్టతనిచ్చింది. ప్రజాప్రతినిధులైనా, సామాన్యులైనా పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనలో భాగంగా.. అందరికీ ఒకేరకమైన నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

Updated Date - Sep 21 , 2026 | 04:50 AM