Share News

ఫారం 6కు ‘సర్‌’ ధ్రువీకరణ అక్కర్లేదు: ఈసీ

ABN , Publish Date - Oct 01 , 2026 | 05:13 AM

ఓటు నమోదుకు సమర్పించే ఫారం-6 దరఖాస్తులో అదనపు వివరాల ధ్రువీకరణ ఇక అవసరం లేదు. తెలంగాణ, ఏపీ సహా ప్రత్యేక సమగ్ర సర్వే (సర్‌) పూర్తయిన అన్ని రాష్ట్రాల్లో ఈ అనుబంధ ధృవీకరణను ఎన్నికల సంఘం (ఈసీ) తొలగించింది.

ఫారం 6కు   ‘సర్‌’ ధ్రువీకరణ   అక్కర్లేదు: ఈసీ
SIR

  • ఫారం 6కు ‘సర్‌’ ధ్రువీకరణ ఇక అక్కర్లే

తొలగించిన ఎన్నికల సంఘం

  • ఓటు నమోదుకు ఫారం ఒక్కటీ సమర్పిస్తే చాలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 30: ఓటు నమోదుకు సమర్పించే ఫారం-6 దరఖాస్తులో అదనపు వివరాల ధ్రువీకరణ ఇక అవసరం లేదు. తెలంగాణ, ఏపీ సహా ప్రత్యేక సమగ్ర సర్వే (సర్‌) పూర్తయిన అన్ని రాష్ట్రాల్లో ఈ అనుబంధ ధృవీకరణను ఎన్నికల సంఘం (ఈసీ) తొలగించింది. సర్‌ నిర్వహించే రాష్ట్రాల్లోనే ఇది కొనసాగుతుందని స్పష్టం చేసింది. సర్‌ సమయంలో ఫారం-6కు అదనంగా ఒక డిక్లరేషన్‌ను ఈసీ జోడించింది. గత సర్‌లోని తమ వివరాలు లేదా తమ తల్లిదండ్రులు, అవి కూడా లేకపోతే నాయినమ్మ/అమ్మమ్మ, తాతయ్య వివరాలు (పోలింగ్‌ బూత్‌ నంబర్‌, క్రమ సంఖ్య తదితర) నమోదు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ ఇబ్బంది తప్పింది. ఈసీఐనెట్‌ యాప్‌, పోర్టల్‌తోపాటు, రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారుల పోర్టళ్ల నుంచి ఈ అనుబంధ దృవీకరణను తొలగించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఇకపై ఓటు కోసం దరఖాస్తు చేసుకునేవారు ఫారం-6 ఒక్కటి సమర్పిస్తే చాలు.

Updated Date - Oct 01 , 2026 | 05:22 AM