Share News

విజయ్‌ పార్టీ గుర్తు విజిల్‌.. కేటాయించిన ఈసీ

ABN , Publish Date - Jan 23 , 2026 | 03:51 AM

ప్రముఖ సినీ నటుడు విజయ్‌ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ‘విజిల్‌’ చిహ్నం కేటాయించింది.

విజయ్‌ పార్టీ గుర్తు విజిల్‌.. కేటాయించిన ఈసీ

చెన్నై, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీ నటుడు విజయ్‌ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ‘విజిల్‌’ చిహ్నం కేటాయించింది. ప్రతిపాదించిన పది చిహ్నాలలో విజయ్‌ కోరుకున్నట్లుగానే విజిల్‌ను ఈసీ కేటాయించింది. విజిల్‌కు విజయ్‌కు అవినాభావ సంబంధముందని ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయ్‌ చిత్రం ‘గోట్‌’లో ఉన్న ‘విజిల్‌ పోడు’ (విజిల్‌ ఊదు) అనే పాట ఎంతో పాపులర్‌ అయింది. ఆయన నటించిన ‘బిగిల్‌’ (విజిల్‌) అనే చిత్రం కూడా సూపర్‌ హిట్టయింది. చిహ్నం కేటాయింపుపై పార్టీ సంయుక్త కార్యదర్శి నిర్మల్‌కుమార్‌ గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ఈ గుర్తుపై ఇప్పటికే పార్టీ నేతలు ప్రజల్లో అవగాహన కల్పించారని పేర్కొన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 03:51 AM