Share News

అల్యూమినియం తయారీ హబ్‌గా భారతదేశ తూర్పు ప్రాంతం

ABN , Publish Date - Sep 29 , 2026 | 05:44 AM

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ తూర్పు ప్రాంతాన్ని పారిశ్రామిక అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు

అల్యూమినియం తయారీ హబ్‌గా భారతదేశ తూర్పు ప్రాంతం
kishanReddy

  • ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ సామర్థ్యాలను

సమన్వయపరుస్తాం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ తూర్పు ప్రాంతాన్ని పారిశ్రామిక అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఖనిజాల నిర్వహణకు సంబంధించి ఒడిశాకు ఉన్న సామర్థ్యాన్ని పశ్చిమబెంగాల్‌లోని పారిశ్రామిక, ఆర్థిక, రవాణా సామర్థ్యంతో అనుసంధానించడం ద్వారా.. తూర్పు ప్రాంతాన్ని ప్రపంచస్థాయి అల్యూమినియం తయారీ హబ్‌గా మార్చవచ్చన్నారు. సోమవారం కోల్‌కతాలో నిర్వహించిన ‘అంగుల్‌ అల్యూమినియం పార్క్‌ రోడ్‌ షో’లో పరిశ్రమలు, వ్యాపార రంగాల ప్రతినిధులను ఉద్దేశించి కిషన్‌రెడ్డి మాట్లాడారు. రక్షణ, రైల్వే, ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఏరోస్పేస్‌ వంటి అనేక రంగాల్లో అల్యూమినియం కీలకమని.. ‘భారత్‌ నెట్‌ జీరో 2070’ లక్ష్య సాధనలోనూ అల్యూమినియం ప్రధానపాత్ర పోషిస్తుందని తెలిపారు. ‘అల్యూమినియం విజన్‌ 2047’ ద్వారా అల్యూమినియం ఉత్పత్తిని ఆరు రెట్లు పెంచడం, బాక్సైట్‌ ఉత్పత్తిని ఏటా 150 మిలియన్‌ టన్నులకు తీసుకెళ్లడం, రీసైక్లింగ్‌ను గణనీయంగా పెంచడం, లో కార్బన్‌ టెక్నాలజీలను ప్రోత్సహిస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రపంచ అల్యూమినియం మార్కెట్‌లో భారత్‌ వాటాను 2047 నాటికి 10 శాతానికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

ఈ వార్తలు కూడా చదవండి

రోడ్డు తనిఖీలో చెంపదెబ్బ వివాదం! ఢిల్లీ మంత్రి పర్వేష్ వర్మపై కేసు నమోదు

ఎల్‌పీయూలో భయానక రాత్రి.. ఆ రోజు ఏం జరిగింది.

Updated Date - Sep 29 , 2026 | 05:51 AM