మహారాష్ట్రలో భూకంపం
ABN , Publish Date - Apr 12 , 2026 | 03:40 AM
మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.7గా నమోదైంది. వాస్మాత్ తాలూకా...
ఛత్రపతి శంభాజీనగర్, ఏప్రిల్ 11: మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.7గా నమోదైంది. వాస్మాత్ తాలూకా శిర్లీ గ్రామంలో భూమికి 10 కి.మీ.లోతులో భూకంప కేంద్రం నమోదైంది. ఉదయం 8.45 గంటల సమయంలో భూమి కంపించినట్టు రికార్డయింది. పనగ్రా షిండే గ్రామంలో కొన్ని ఇళ్లకు స్వల్పంగా పగుళ్లు వచ్చాయని హింగోలీ కలెక్టర్ రాహుల్ గుప్తా చెప్పారు. పర్భణి, నాందేడ్ జిల్లాల్లోనూ కనిపించింది.