Share News

ఈ20 కాదు.. 420

ABN , Publish Date - Nov 08 , 2026 | 03:03 AM

పెట్రోల్‌లో 20ు పరిమితికి మించి ఇథనాల్‌ను కలుపుతున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు.

ఈ20 కాదు.. 420

  • ఎక్స్‌ వేదికగా రాహుల్‌గాంధీ విమర్శలు

న్యూఢిల్లీ, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): పెట్రోల్‌లో 20ు పరిమితికి మించి ఇథనాల్‌ను కలుపుతున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. కేంద్రం చెబుతున్న ఈ-20 విధానం(పెట్రోల్‌లో 20ు ఇథనాల్‌ మిశ్రమం) ఈ-420గా(మోసం) మారిందని ఎక్స్‌ వేదికపై చేసిన పోస్టులో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్‌ బంకుల నుంచి నమూనాలు సేకరించి ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహించగా, నిర్దేశిత పరిమితికి మించి ఇథనాల్‌ ఉన్నట్లుగా వెల్లడైందని రాహుల్‌ గాంధీ తెలిపారు. 14 నమూనాలను పరీక్షించగా.. 11 నమూనాల్లో ఇథనాల్‌ శాతం 20 దాటినట్లు వెల్లడించారు. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీఎల్‌)కు చెందిన నమూనాల్లో 31.2శాతం, హిందుస్థాన్‌ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్‌) నమూనాల్లో 30.5శాతం ఇథనాల్‌ ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఐవోసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌తో పాటు ప్రైవేటు సంస్థలైన నయారా, షెల్‌ విక్రయ కేంద్రాల నుంచి సేకరించిన నమూనాల్లోనూ 20 శాతానికి పైనే ఇథనాల్‌ ఉన్నట్లు ఆరోపించారు.

Updated Date - Nov 08 , 2026 | 03:05 AM