Share News

సైబర్‌ నేరాల బాధితుల్లో విద్యావంతులే ఎక్కువ

ABN , Publish Date - Sep 30 , 2026 | 05:17 AM

విద్యావంతులే తరుచుగా సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కి డబ్బు పోగొట్టుకుంటున్నారని మద్రాస్‌ ఐఐటీ అధ్యయనం వెల్లడించింది.

సైబర్‌ నేరాల బాధితుల్లో విద్యావంతులే ఎక్కువ
cyber

చెన్నై, సెప్టెంబరు 29: విద్యావంతులే తరుచుగా సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కి డబ్బు పోగొట్టుకుంటున్నారని మద్రాస్‌ ఐఐటీ అధ్యయనం వెల్లడించింది. బాధితుల జాబితాలో ఐటీ నిపుణులు, బ్యాంకర్లు, డాక్టర్లు, మేనేజ్‌మెంట్‌, ఫైనాన్స్‌ నిపుణులు, ప్రభుత్వ అధికారులతో పాటు సైబర్‌ సెక్యూరిటీలో సర్టిఫికెట్లు ఉన్న వాళ్లు కూడా ఉన్నారని మంగళవారం విడుదల చేసిన ఆ అధ్యయనం వెల్లడించింది. జీవితంలో ఒత్తిడికి లోనైప్పుడో, ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలోనో బాధితులు నేరగాళ్లకు చిక్కుతున్నారని అధ్యయనం తెలిపింది. బాధితులను ఆలోచించుకోనివ్వకుండా నేరగాళ్లు ‘మైండ్‌ అరెస్ట్‌’ చేస్తున్నారని పేర్కొంది. నేరగాళ్లకు చిక్కాక.. బాధితులు అవమానం, కుంగుబాటు, కుటుంబంలో విశ్వాసం పోగొట్టుకోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని ఈ అధ్యయనం విశ్లేషించింది.

Updated Date - Sep 30 , 2026 | 05:19 AM