దుబాయ్ ఎయిర్‌పోర్టుకు 20 విమానాలే
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:27 AM
నిరంతరం విమానాల రాకపోకలతో రద్దీగా ఉండే దుబాయ్ ఎయిర్‌పోర్టు ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్థ వాతావరణంతో బోసిపోతోంది.
న్యూఢిల్లీ, మార్చి 3: నిరంతరం విమానాల రాకపోకలతో రద్దీగా ఉండే దుబాయ్ ఎయిర్‌పోర్టు ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్థ వాతావరణంతో బోసిపోతోంది. రోజూ 12 వందలకు పైగా విమాన సర్వీసులు నడిచే ఇక్కడి ఎయిర్‌పోర్టులో సోమవారం 20 విమానాలు మాత్రమే రాకపోకలు సాగించాయి. పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ వాతావరణంతో ఇక్కడి పలు దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. దారి మార్చుకోవాలని లేదా సర్వీసుల్ని రద్దు చేసుకోవాలని విమాన సంస్థలకు స్పష్టం చేశాయి. దీంతో ఈ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగించే యూరప్, ఆసియా విమానాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నియంత్రణల కారణంగా దుబాయ్ ఎయిర్‌పోర్టులో విమానాల రాక భారీగా తగ్గిపోయింది.