Share News

డ్రైవింగ్‌ లైసెన్స్‌ పరీక్ష పాస్‌ మార్కులు 75 శాతానికి పెంపు !

ABN , Publish Date - Oct 23 , 2026 | 03:57 AM

వాహనదారుల రహదారి భద్రతను మరింత మెరుగుపరిచేందుకు కేంద్రం కీలక చర్యలకు సిద్ధమైంది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీకి సంబంధించిన ట్యుటోరియల్‌ పరీక్ష ఉత్తీర్ణత మార్కులను 60 శాతం నుంచి 75 శాతానికి పెంచాలని ప్రతిపాదించింది.

డ్రైవింగ్‌ లైసెన్స్‌ పరీక్ష పాస్‌ మార్కులు 75 శాతానికి పెంపు !

న్యూఢిల్లీ, అక్టోబరు 22: వాహనదారుల రహదారి భద్రతను మరింత మెరుగుపరిచేందుకు కేంద్రం కీలక చర్యలకు సిద్ధమైంది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీకి సంబంధించిన ట్యుటోరియల్‌ పరీక్ష ఉత్తీర్ణత మార్కులను 60 శాతం నుంచి 75 శాతానికి పెంచాలని ప్రతిపాదించింది. అలాగే, ఆధార్‌ కార్డు ఆధారంగా ఆన్‌లైన్‌లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ సేవలు పొందేవారికి ఫీజుల నుంచి మినహాయింపు ఇవ్వాలని అనుకుంటోంది. ఇందుకు కేంద్ర మోటారు వాహనాల నిబంధనల్లో మార్పులను ప్రతిపాదిస్తూ ముసాయిదాను సిద్ధం చేసింది. ఇందులో డ్రైవింగ్‌ లైసెన్స్‌ ట్యుటోరియల్‌ పరీక్ష కనీస మార్కుల శాతం పెంపుతోపాటు పరీక్ష నిడివిని 30 నిమిషాలకు పెంచాలని ప్రతిపాదించింది. అలాగే, డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ చేసే అధికారులు.. కొత్త లైసెన్స్‌, సవరణలకు తమ వద్దకు వచ్చిన దరఖాస్తులను 15 రోజుల్లోగా పరిష్కరించాలని పేర్కొంది. అలాగే, లైసెన్స్‌దారుడి పేరు, చిరునామాల సవరణలకు వసూలు చేసే రుసుమును రద్దు చేయాలనే ప్రతిపాదన కూడా చేసింది. కాగా, కారుల్లో అడ్వాన్స్‌డ్‌ ఎమర్జెన్సీ బ్రేకింగ్‌ సిస్టమ్‌(ఏఈబీఎ్‌స)ను తప్పనిసరి చేయాలని కేంద్రం నిర్ణయించింది. 2030 అక్టోబరు 1నాటికి మార్కెట్‌లోకి వచ్చే అన్ని కారుల్లో ఏఈబీఎస్‌ వ్యవస్థ తప్పనిసరిగా అమర్చాలని ప్రతిపాదించింది. ఇప్పటికే ఉత్పత్తిలో ఉన్న కార్లకు ఈ గడువును 2032 అక్టోబరు 1గా నిర్దేశించింది. లారీలు, బస్సుల్లాంటి వాణిజ్య వాహనాలకైతే 2027అక్టోబరు 1ని గడువుగా విధించింది.

Updated Date - Oct 23 , 2026 | 03:58 AM