జర్నలిస్టులు, వార్తా సంస్థలు డీపీడీపీ చట్టం పరిధిలోకి రారు
ABN , Publish Date - Nov 08 , 2026 | 02:38 AM
జర్నలిస్టులు, వార్తా సంస్థలు డిజిటల్ వ్యక్తిగత డేటా చట్టం(డీపీడీపీ) పరిధిలోకి రారని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
చట్టంలో స్పష్టమైన నిర్వచనం ఉందన్న ప్రభుత్వ వర్గాలు
న్యూఢిల్లీ, నవంబరు 7: జర్నలిస్టులు, వార్తా సంస్థలు డిజిటల్ వ్యక్తిగత డేటా చట్టం(డీపీడీపీ) పరిధిలోకి రారని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. వీరు చట్టంలోని ‘డేటా ఫిడూషియరీ’ (వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి వినియోగించే) నిర్వచనం పరిధిలోకి రారని తెలిపాయి. ఈ చట్టం వల్ల పత్రికా స్వేచ్ఛ, పరిశోధనాత్మక జర్నలిజానికి ఆటంకాలు కలుగుతాయన్న ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వ వర్గాలు ఈ వివరణ ఇచ్చాయి. వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, వినియోగించే బ్యాంకులు, బీమా సంస్థలు, టెలికం ఆపరేటర్లు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు తదితర సంస్థలు చట్టం పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశాయి. జర్నలిస్టుల కార్యకలాపాలకు స్పష్టమైన రక్షణ కల్పించేలా చట్ట సవరణ అవసరమా అన్న దానిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి.