తెలుగు పార్టీలకు తగ్గిన విరాళాలు
ABN , Publish Date - Sep 29 , 2026 | 05:35 AM
ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం, వైసీపీలకు లభించిన విరాళాల్లో తగ్గుదల కనిపించినట్టు ఆయా పార్టీల నివేదికలు పేర్కొంటున్నాయి.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 28: ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం, వైసీపీలకు లభించిన విరాళాల్లో తగ్గుదల కనిపించినట్టు ఆయా పార్టీల నివేదికలు పేర్కొంటున్నాయి. రూ.20వేలకు మించి వచ్చిన విరాళాలను ఏటా ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉన్న నేపథ్యంలో ఆ వివరాలను నివేదికల్లో పొందుపరిచాయి. తెలుగుదేశం పార్టీకి 2024-25లో రూ.83.03 కోట్ల విరాళాలు రాగా, 2025-26లో రూ.58.25 కోట్లు వచ్చాయి. వైసీపీకి 2024-25లో రూ.140.04 కోట్లు రాగా, 2025-26లో మాత్రం కేవలం రూ.24.31 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇదే సంవత్సరాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి లభించిన విరాళాలు కూడా రూ.38.10 కోట్ల నుంచి రూ.12.10 కోట్లకు తగ్గాయి.
ఈ వార్తలు కూడా చదవండి
రోడ్డు తనిఖీలో చెంపదెబ్బ వివాదం! ఢిల్లీ మంత్రి పర్వేష్ వర్మపై కేసు నమోదు
ఎల్‌పీయూలో భయానక రాత్రి.. ఆ రోజు ఏం జరిగింది.