Share News

వైదిక పద్ధతిలో డీఎంకే నేత మనవరాలి పెళ్లి

ABN , Publish Date - Nov 08 , 2026 | 02:51 AM

ద్రావిడ సిద్ధాంతాన్ని పెంచి పోషించిన నేతల్లో ఒకరైన డీఎంకే ప్రధాన కార్యదర్శి, తమిళనాడు మాజీ మంత్రి దురైమురుగన్‌ మనవరాలు సెంథామరై వివాహం ఈ నెల..

వైదిక పద్ధతిలో డీఎంకే నేత మనవరాలి పెళ్లి

  • ఆమె కోరిక మేరకే చేశామన్న దురైమురుగన్‌

చెన్నై, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ద్రావిడ సిద్ధాంతాన్ని పెంచి పోషించిన నేతల్లో ఒకరైన డీఎంకే ప్రధాన కార్యదర్శి, తమిళనాడు మాజీ మంత్రి దురైమురుగన్‌ మనవరాలు సెంథామరై వివాహం ఈ నెల 1న సినీ నిర్మాత కన్నన్‌ రవి కుమారుడు దీపక్‌తో వైదిక పద్ధతిలో జరగడం చర్చనీయాంశమైంది. దీనిని ద్రావిడర్‌ కళగం నేత కె.వీరమణి తీవ్రంగా విమర్శించారు. డీఎంకే మూల సిద్ధాంతమైన హేతువాదానికి దురైమురుగన్‌ దూరమయ్యారా? అని నిలదీశారు. అన్ని వైపుల నుంచి విమర్శలు రేగుతుండడంతో దురైమురుగన్‌ వివరణ ఇచ్చారు. మనవరాలి కోరిక మేరకే వైదిక పద్ధతిలో వివాహం చేశామని, ఆమె కోరికను గౌరవించాల్సిన కనీస బాధ్యత తమపై ఉందని వివరించారు. ‘విదేశాల్లో చదువుకున్న నా మనవరాలు వేరే వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమిస్తున్నానని, అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. అంతేగాక వైదిక పద్ధతిలో వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది. ఆమె కోరిక మేరకే వైదిక ఆచారాల ప్రకారం పెళ్లి జరిపించాం. ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఓ ప్రకటనలో దురైమురుగన్‌ పేర్కొన్నారు.

Updated Date - Nov 08 , 2026 | 02:55 AM