Share News

డీఎంకేతో విజయకాంత్‌ పార్టీ పొత్తు

ABN , Publish Date - Feb 20 , 2026 | 02:52 AM

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాట కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. దివంగత నటుడు విజయకాంత్‌ స్థాపించిన...

డీఎంకేతో విజయకాంత్‌ పార్టీ పొత్తు

చెన్నై, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాట కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. దివంగత నటుడు విజయకాంత్‌ స్థాపించిన డీఎండీకే పార్టీ అధికార డీఎంకేతో పొత్తు కుదుర్చుకుంది. విజయకాంత్‌ సతీమణి, డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత, ఆమె సోదరుడు, పార్టీ కోశాధికారి ఎల్‌కే సుధీష్‌ గురువారం డీఎంకే ప్రధాన కార్యాలయానికి వచ్చి డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌తో భేటీ అయ్యారు. పొత్తు కుదిరినట్లు అనంతరం ఇరుపార్టీల నేతలు ప్రకటించారు.

Updated Date - Feb 20 , 2026 | 02:52 AM