3న డీకే పట్టాభిషేకం!
ABN , Publish Date - May 31 , 2026 | 04:49 AM
కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నేతగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను ఎమ్మెల్యేలు శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కర్ణాటక కొత్త సీఎంగా శివకుమార్
బెంగళూరు, మే 30 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నేతగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను ఎమ్మెల్యేలు శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో డీకే తదుపరి సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. సీఎల్పీ భేటీ అనంతరం సిద్దరామయ్య, ఇతర సీనియర్ నేతలతో కలిసి డీకే శివకుమార్ గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌ను లోక్‌భవన్‌లో కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసేందుకు జూన్ 3వ తేదీన ముహూర్తం ఖరారు చేశారు. శనివారం సాయంత్రం విధానసౌధలో జరిగిన సమావేశంలో సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ పేరును పేరును ఆపద్ధర్మ సీఎంగా ఉన్న సిద్దరామయ్య ప్రతిపాదించగా.. మరో సీనియర్ నేత పరమేశ్వర్ మద్దతు పలికారు.