డీకే, కుటుంబంపై భక్తుల కన్నెర్ర!
ABN , Publish Date - Nov 10 , 2026 | 02:57 AM
కర్ణాటకలోని హాసనాంబ ఆలయంలో వీఐపీ సంస్కృతిపై భక్తుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. స్వయంగా రాష్ట్ర సీఎం డీకే శివకుమార్, ఆయన కుటుంబ సభ్యులు ఆలయంలో..
ఆలయంలో ఎంతసేపు ఉంటారంటూ మండిపాటు
బెంగళూరు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని హాసనాంబ ఆలయంలో వీఐపీ సంస్కృతిపై భక్తుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. స్వయంగా రాష్ట్ర సీఎం డీకే శివకుమార్, ఆయన కుటుంబ సభ్యులు ఆలయంలో ఎక్కువసేపు గడిపారంటూ, క్యూలైన్ ఆపేశారంటూ భక్తులు అసహనానికి గురై, ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆలయంలో ముఖ్యమంత్రి కూర్చున్న దృశ్యాలు కనబడుతున్న ఎల్ఈడీ స్ర్కీన్‌పై చెప్పులు విసిరారు. హాసన్ జిల్లా కేంద్రంలోని హాసనాంబ ఆలయాన్ని ఏడాదికి ఒకసారి పదిరోజులపాటు మాత్రమే తెరుస్తారు. ఆ సమయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు వస్తారు. ఆదివారం రద్దీ ఉన్న సమయంలో శివకుమార్ తన కుటుంబ సభ్యులతో కలసి ఆలయానికి వెళ్లారు. గర్భగుడిలో పూజలు నిర్వహించుకున్నారు. సీఎం పర్యటనతో పోలీసులు ముందుగానే దర్శనాలను నిలిపివేశారు.