Share News

దీపావళి వేళ మృత్యుఘోష

ABN , Publish Date - Nov 10 , 2026 | 06:14 AM

దీపావళి రోజు దేశవ్యాప్తంగా సంభవించిన వరుస అగ్నిప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, ఢిల్లీ, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఆదివారం రాత్రి నుంచి..

దీపావళి వేళ మృత్యుఘోష

  • దేశవ్యాప్తంగా అగ్నిప్రమాదాల్లో 23 మంది మృత్యువాత

  • 7 చోట్ల ప్రమాదాలు.. పలువురి సజీవ దహనం

  • మహారాష్ట్రలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతి

  • అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 13మంది దుర్మరణం.. ఢిల్లీలో చిచ్చుబుడ్డి పేలి బాలుడి మృతి

న్యూఢిల్లీ, నవంబరు 9: దీపావళి రోజు దేశవ్యాప్తంగా సంభవించిన వరుస అగ్నిప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, ఢిల్లీ, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు జరిగిన ఏడు ప్రధాన ప్రమాదాల్లో ఏకంగా 23మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని మూడు వేర్వేరు చోట్ల జరిగిన అగ్నిప్రమాదాలు 13మందిని బలిగొన్నాయి. కట్నీ జిల్లాలోని బర్హి పట్టణంలోని ఓ ప్లాస్టిక్‌ వస్తువుల దుకాణ భవనంలో అర్థరాత్రి మంటలు చెలరేగి, పైఅంతస్తులో నిద్రిస్తున్న ఓ వ్యాపారి కుటుంబానికి చెందిన ఆరుగురు (2నెలల పసికందు సహా) ఊపిరాడక మృతి చెందారు. అలాగే సియోనీ జిల్లాలోని ఛఫారాలో ఓ నగల వ్యాపారి ఇంట్లో జరిగిన ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. ఉజ్జయినిలో ఓ హార్డ్‌వేర్‌ దుకాణానికి అంటుకున్న మంటల్లో 107ఏళ్ల వృద్ధుడు ఊపిరాడక మరణించాడు. ఇక,మహారాష్ట్రలోని ధార్‌శివ్‌ జిల్లా యేడ్షి గ్రామంలో కిరాణా దుకాణం పైన ఉన్న ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవ దహనమయ్యారు. రాజస్థాన్‌లోని పాలీ జిల్లాలోని ఓ టపాసుల దుకాణంలో మంటలు చెలరేగి ఇద్దరు చనిపోయారు. ఢిల్లీలో చిచ్చుబుడ్డి కాలుస్తుండగా పేలి పదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

Updated Date - Nov 10 , 2026 | 06:32 AM