Share News

సీఈసీని సస్పెండ్‌ చేయండి

ABN , Publish Date - Sep 30 , 2026 | 04:57 AM

ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని వచ్చేవారం లిస్టింగ్‌ చేస్తామని సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది

సీఈసీని సస్పెండ్‌ చేయండి
SUPREMECOURT

  • సీఈసీని సస్పెండ్‌ చేయండి

  • సీజేఐ పర్యవేక్షణలోనే

కొత్త కమిషనర్‌ను వేయండి

  • ఈసీవి ఏకాభిప్రాయ లేదా

మెజారిటీ నిర్ణయాలే కావాలి

  • సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు

  • లిస్టింగ్‌కు సీజేఐ ధర్మాసనం ఓకే

న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని వచ్చేవారం లిస్టింగ్‌ చేస్తామని సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది. ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే సీఈసీ నిర్ణయాలు తీసుకుంటున్నారని పిటిషనర్‌ ఆరోపించారు. సీనియర్‌ న్యాయవాది వికా్‌ససింగ్‌ ఈ అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ వి.మోహనలతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఎన్నికల సంఘం నిర్ణయాలు ఏకగ్రీవంగా కానీ, మెజారిటీతో కానీ జరగాలని పిటిషనర్‌ గుర్తు చేశారు. ఈసీ పనితీరు చూస్తుంటే చట్టబద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నట్లు లేదని అనుమానాలు వ్యక్తం చేశారు. పిటిషన్‌ను వచ్చేవారం లిస్ట్‌ చేస్తామని ప్రధాన న్యాయమూర్తి ప్రకటించారు. బిహార్‌కు చెందిన రాకేశ్‌ కుమార్‌ సింగ్‌ ఈ పిటిషన్‌ వేశారు. సమష్టి అధికారాలను సీఈసీ వ్యక్తిగతంగా ఒక్కరే చెలాయిస్తున్నారా? లేదా? తేల్చాలని కోరారు. తుది విచారణ పూర్తయ్యే వరకు సీఈసీ విధులు నిర్వర్తించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆయన పరోక్షంలో మిగతా ఇద్దరు ఏకాభిప్రాయ నిర్ణయాలతో ఎన్నికల సంఘాన్ని నిర్వహించే విధంగా చూడాలన్నారు. ప్రస్తుత సీఈసీని తొలగించడం వల్ల ఏర్పడే ఖాళీని ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిలతో కూడిన కమిటీ నిర్ణయించిన వ్యక్తితో పూరించాలని కోరారు. సీఈసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఇటీవలి ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు.

Updated Date - Sep 30 , 2026 | 04:57 AM