Share News

హిందుస్థాన్‌ ఏ ఒక్కరి సొత్తూ కాదు

ABN , Publish Date - Nov 17 , 2026 | 03:42 AM

హిందుస్థాన్‌ ఏ ఒక్కరి సొత్తూ కాదని, దేశ మట్టిలో అందరి రక్తం కలిసే ఉందని పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్‌ దొసాంజ్‌ అన్నారు.

హిందుస్థాన్‌ ఏ ఒక్కరి సొత్తూ కాదు

  • పంజాబ్‌ గాయకుడు దిల్జీత్‌ దొసాంజ్‌

ఇండోర్‌, నవంబరు 16: హిందుస్థాన్‌ ఏ ఒక్కరి సొత్తూ కాదని, దేశ మట్టిలో అందరి రక్తం కలిసే ఉందని పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్‌ దొసాంజ్‌ అన్నారు. ఈ నెల 15న మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో కచేరీ ప్రారంభిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కచేరీ జరగకుండా కొందరు అడ్డంకులు సృష్టించారని ఆయన గుర్తు చేశారు. ఇండోర్‌ మహాకాలుడి నేల అని, తనను రాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు. అభిమానులను కలుసుకోకుండా తనను ఎవ్వరూ భయపెట్టలేరని ఆయన అన్నారు. కచేరీకి వారం ముందే మద్యం, మాదకద్రవ్యాలు, ఆయుధాల వాడకాన్ని ప్రోత్సహించేలా ఉన్న నాలుగు పాటలు పాడవద్దని ఆయనకు జిల్లా అధికారులు సూచించారు. చిన్నారులపై ప్రభావం చూపేలా ఉన్నాయంటూ గతంలో పంజాబ్‌-హర్యానా హైకోర్ట్‌ అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని గుర్తు చేశారు. అయినా కూడా అధికారులను సూచనలు పట్టించుకోకుండా దొసాంజ్‌ పాడటం దుమారం రేపుతోంది.

Updated Date - Nov 17 , 2026 | 03:43 AM