Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ పేరుతో ఢిల్లీలో ఘరానా మోసం
ABN , Publish Date - Jan 12 , 2026 | 07:15 AM
సైబర్ నేరగాళ్ల మోసాలకు అడ్డుకట్ట పడడంలేదు. తాజాగా ఢిల్లీలో నివసిస్తున్న వృద్ధ ఎన్‌ఆర్ ఐ దంపతులు సుమారు రెండువారాల పాటు డిజిటల్ అరెస్ట్‌లో ఉండి..
వృద్ధ దంపతుల నుంచి రూ. 14.85 కోట్ల దోపిడీ
న్యూఢిల్లీ, జనవరి 11: సైబర్ నేరగాళ్ల మోసాలకు అడ్డుకట్ట పడడంలేదు. తాజాగా ఢిల్లీలో నివసిస్తున్న వృద్ధ ఎన్‌ఆర్ ఐ దంపతులు సుమారు రెండువారాల పాటు డిజిటల్ అరెస్ట్‌లో ఉండి.. తమ జీవితకాల పొదుపు సుమారు రూ. 15 కోట్లు పోగొట్టుకున్నారు. ఓం తనేజా, ఇందిరా తనేజాలు 48ఏళ్ల పాటు ఐక్యరాజ్యసమితిలో సేవలందించి, 2015లో భారత్‌కు తిరిగి వచ్చి సామాజిక సేవలో నిమగ్నమయ్యారు. గత డిసెంబర్ 24న డాక్టర్ దంపతులకు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులమంటూ కేటుగాళ్ల వద్ద నుంచి ఓ ఫోన్‌కాల్ వచ్చింది. తప్పుడు అరెస్ట్ వారెంట్లతో వారు ఆ దంపతులను బెదిరించారు. డిసెంబర్ 25 నుంచి జనవరి 10 వరకు.. 17రోజుల పాటు వీడియోకాల్ ద్వారా డిజిటల్ అరెస్ట్ పేరుతో నిర్భంచించారు. నిందితుల బెదిరింపులకు భయపడిన 77 ఏళ్ల ఇందిరా తనేజా పలు విడతల్లో రూ. 14.85 కోట్లు బదిలీ చేశారు. దీనిపై బ్యాంకు సిబ్బంది అనుమానం వ్యక్తం చేసినా.. ఏం చెప్పాలో కూడా కేటుగాళ్లు ముందుగానే ఆమెకు శిక్షణ ఇచ్చి అలాగే చెప్పించారు.