300 ఎన్నికల్లో పోటీ చేసిన ‘ధర్తీ పకడ్’ మృతి
ABN , Publish Date - Sep 05 , 2026 | 05:11 AM
ప్రతి ఎన్నికలోనూ నామినేషన్ వేసి వార్తల్లో నిలిచిన బిహార్‌కు చెందిన వ్యాపారి నాగర్‌మల్ బాజోరియా(97) అనారోగ్యంతో మృతి చెందారు.
ఇందిర, రాజీవ్, వాజ్‌పేయీల ప్రత్యర్థిగా గుర్తింపు
భాగల్పూర్, సెప్టెంబరు 4: ప్రతి ఎన్నికలోనూ నామినేషన్ వేసి వార్తల్లో నిలిచిన బిహార్‌కు చెందిన వ్యాపారి నాగర్‌మల్ బాజోరియా(97) అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం పట్నా ఆస్పత్రిలో మరణించగా, శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ‘ధర్తీ పకడ్’ (జగమొండి) అన్న పేరు గడించిన ఆయన సుమారు 300 ఎన్నికల్లో పోటీ చేశారు. తొలిసారి 1960లో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారు. వి.వి.గిరికి వ్యతిరేకంగా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి వార్తల్లోకి వచ్చారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, వాజ్‌పేయీ, ఆడ్వాణీ, ప్రణబ్ ముఖర్జీ తదితర ప్రముఖులందరిపైనా పోటీ చేశారు. చివరిసారిగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో పట్నాసాహిబ్, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయాలనుకున్నా అనారోగ్యం కారణంగా నామినేషన్ వేయలేకపోయారని మనుమడు గౌరవ్ చెప్పారు.