Share News

యువత భవిష్యత్తు కంటే పదవి ముఖ్యం కాదు

ABN , Publish Date - Aug 10 , 2026 | 05:15 AM

నీట్‌ పేపర్‌ లీకేజీ ఆందోళనల సమయంలో ‘జెన్‌జీ’ని కొంత మంది తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని కేంద్ర మాజీ విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆరోపించారు.

యువత భవిష్యత్తు కంటే పదవి ముఖ్యం కాదు

  • జెన్‌జీని తప్పుదోవ పట్టించే యత్నాలు: ధర్మేంద్ర ప్రధాన్‌

భువనేశ్వర్‌, ఆగస్టు 9: నీట్‌ పేపర్‌ లీకేజీ ఆందోళనల సమయంలో ‘జెన్‌జీ’ని కొంత మంది తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని కేంద్ర మాజీ విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆరోపించారు. అలా జరగకూడదనే ఉద్దేశంతోనే తాను మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. యువత భవిష్యత్తు కంటే తనకు పదవి ముఖ్యమేం కాదని పేర్కొన్నారు. శనివారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని జీఎం వర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడారు. యువత కంటే మంత్రి పదవి ముఖ్యమైనదేమీ కాదని పేర్కొన్నారు.

Updated Date - Aug 10 , 2026 | 05:16 AM