Share News

గల్ఫ్‌లోని తొమ్మిది దేశాల గగనతలం వాడొద్దు

ABN , Publish Date - Mar 21 , 2026 | 03:50 AM

అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా గల్ఫ్‌ ప్రాంతంలోని 9 దేశాల గగనతలాన్ని ఉపయోగించవద్దని డీజీసీఏ....

గల్ఫ్‌లోని తొమ్మిది దేశాల గగనతలం వాడొద్దు

న్యూఢిల్లీ, మార్చి 20: అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా గల్ఫ్‌ ప్రాంతంలోని 9 దేశాల గగనతలాన్ని ఉపయోగించవద్దని డీజీసీఏ భారతీయ విమానయాన సంస్థలను కోరింది. బహ్రెయిన్‌, ఇరాన్‌, ఇరాక్‌, ఇజ్రాయెల్‌, జోర్డాన్‌, కువైత్‌, లెబనాన్‌, ఖతార్‌, యూఏఈ మీదుగా విమాన సర్వీసులను నివారించి, అత్యవసర ప్రణాళికలు అములుచేసి ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకోవాలని సూచించింది. భారతీయ విమానయాన సంస్థలు ఒమన్‌, సౌదీ అరేబియా గగనతలం ద్వారా పరిమితంగా ప్రయాణించేందకు అనుమతి ఉంది కానీ.. కచ్చితంగా 32వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో మాత్రమే ప్రయాణించాలనే నిబంధన ఉందని డీజీసీఏ తెలిపింది. ఈ సలహాలు తక్షణమే అమలులోకి వస్తాయని, ఈ నెల 28 వరకూ కొనసాగుతుందని పేర్కొంది.

Updated Date - Mar 21 , 2026 | 03:50 AM