Share News

ఇకపై పైలట్లందరికీ డ్రగ్‌ టెస్టులు: డీజీసీఏ

ABN , Publish Date - Sep 11 , 2026 | 05:48 AM

ఇకపై అన్ని ఎయిర్‌లైన్స్‌లలో పనిచేసే పైలట్లందరికీ డ్రగ్‌ టెస్టులు నిర్వహించాలని డీజీసీఏ(డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌) నిర్ణయించింది.

ఇకపై పైలట్లందరికీ డ్రగ్‌ టెస్టులు: డీజీసీఏ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 10: ఇకపై అన్ని ఎయిర్‌లైన్స్‌లలో పనిచేసే పైలట్లందరికీ డ్రగ్‌ టెస్టులు నిర్వహించాలని డీజీసీఏ(డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌) నిర్ణయించింది. 2027 జూలై లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 12 వేల మందికి పైగా కమర్షియల్‌ పైలట్లకు డ్రగ్‌ టెస్టులు నిర్వహించనున్నారు. ఈ టెస్టులకు సంబంధించిన కొత్త నిబంధనలు ఈ నెలాఖరు నాటికి సిద్ధమయ్యే అవకాశం ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు.

Updated Date - Sep 11 , 2026 | 05:49 AM