Share News

విమానాల్లో ఆ మోడల్‌ పవర్‌ బ్యాంకులపై నిషేధం

ABN , Publish Date - Oct 15 , 2026 | 04:04 AM

ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ‘మోబికిన్స్‌ ఎమ్‌కే-పీబీ-04’ మోడల్‌ పవర్‌ బ్యాంకులను విమానాల్లో వాడటంతో పాటు, రవాణా చేయడాన్ని నిషేధిస్తూ డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది

విమానాల్లో ఆ మోడల్‌ పవర్‌ బ్యాంకులపై నిషేధం
aeroplane

న్యూఢిల్లీ, అక్టోబరు 14: ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ‘మోబికిన్స్‌ ఎమ్‌కే-పీబీ-04’ మోడల్‌ పవర్‌ బ్యాంకులను విమానాల్లో వాడటంతో పాటు, రవాణా చేయడాన్ని నిషేధిస్తూ డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పవర్‌ బ్యాంకుల వల్ల ఇటీవల చోటుచేసుకున్న ప్రమాద ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌కు వచ్చే, భారత్‌ నుంచి వెళ్లే, దేశీయంగా నడిచే ఏ విమానంలోనూ దీనిని లగేజీలో కానీ, కార్గో రూపంలో గానీ తీసుకెళ్లకూడదని పేర్కొంది.

Updated Date - Oct 15 , 2026 | 04:35 AM