భోజ్‌శాల సరస్వతీ ఆలయానికి పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - May 17 , 2026 | 05:00 AM
మధ్యప్రదేశ్‌లోని భోజ్‌శాల కాంప్లెక్స్ సరస్వతి (వాగ్దేవి) ఆలయమేనని ఆ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ప్రకటించిన నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో...
ధార్, మే 16: మధ్యప్రదేశ్‌లోని భోజ్‌శాల కాంప్లెక్స్ సరస్వతి (వాగ్దేవి) ఆలయమేనని ఆ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ప్రకటించిన నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. భోజ్‌శాల ప్రాంగణాన్ని పూలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మంత్రోచ్ఛారణలతో పాటు సరస్వతి వందనం, హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఎంతో కాలంగా ఆలయంలో పూజలు నిర్వహించాలని ఎదురుచూస్తున్నామని, హైకోర్టు తీర్పుతో తమ కల నెరవేరిందని భక్తులు తెలిపారు. మరోవైపు భక్తుల రద్దీ నేపథ్యంలో పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.