Share News

ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ హవా

ABN , Publish Date - Sep 20 , 2026 | 06:36 AM

ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఏబీవీపీ సత్తా చాటింది. నాలుగు పోస్టుల్లో మూడింటిని కైవసం చేసుకుంది.

ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ హవా

న్యూఢిల్లీ, సెప్టెంబరు 19: ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఏబీవీపీ సత్తా చాటింది. నాలుగు పోస్టుల్లో మూడింటిని కైవసం చేసుకుంది. అధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పోస్టులను గెలుచుకుంది. అధ్యక్షుడిగా యశ్‌ దబస్‌, కార్యదర్శిగా రియా చావ్డీ, సంయుక్త కార్యదర్శిగా లక్ష్యరాజ్‌సింగ్‌ నెగ్గారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని దాదాపు అన్ని కాలేజీల్లో ఏబీవీపీ క్లీన్‌స్వీ్‌ప చేసింది. ఉపాధ్యక్ష పదవిని ఇండిపెండెంట్‌ అభ్యర్ధి దీపాన్షు గెలుచుకున్నారు. ఏబీవీపీ విద్యార్థి నాయకులకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Sep 20 , 2026 | 06:37 AM