ఇండియా కూటమి నేతలపై నాలుగు ఎఫ్ఐఆర్లు
ABN , Publish Date - Oct 14 , 2026 | 07:06 AM
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ఇండియా కూటమి నేతలు సోమవారం ఢిల్లీలో చేపట్టిన నిరసన ప్రదర్శనలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు సోమవారం నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.
న్యూఢిల్లీ, అక్టోబరు 13 : చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ఇండియా కూటమి నేతలు సోమవారం ఢిల్లీలో చేపట్టిన నిరసన ప్రదర్శనలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు సోమవారం నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఢిల్లీలోని కనాట్ ప్లేస్, సుప్రీంకోర్టుల పరిసరాల్లో బీఎన్ఎ్సఎస్ సెక్షన్ 163 కింద విధించిన నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ఈ కేసులు నమోదు చేశారు. వీటిని ఉల్లంఘించినందుకు తిలక్ మార్గ్ పోలీసుస్టేషన్లో రెండు ఎఫ్ఐఆర్లు, మందిర్ మార్గ్, బరకాంబ రోడ్డు పోలీసుస్టేషన్లలో ఒక్కో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.