Share News

ఢిల్లీలో బాలికపై గ్యాంగ్‌రేప్‌

ABN , Publish Date - Sep 23 , 2026 | 04:35 AM

ఢిల్లీలో మరో ఘోరం చోటు చేసుకుంది. పోలీసులమని బెదిరించి ముగ్గురు దుండగులు సోమవారం ఒక బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఢిల్లీలో బాలికపై గ్యాంగ్‌రేప్‌
rape

న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: ఢిల్లీలో మరో ఘోరం చోటు చేసుకుంది. పోలీసులమని బెదిరించి ముగ్గురు దుండగులు సోమవారం ఒక బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఓ ఆలయానికి తన స్నేహితుడితో కలిసి వెళ్లిన ఆమె దైవ దర్శనం అనంతరం దాని వెనుక చెట్లతో నిండిన పార్కులోకి వెళ్లింది. రాత్రి 7.30 గంటల సమయంలో 25-30 ఏళ్ల వయస్సు ఉన్న ముగ్గురు దుండగులు వారి వద్దకు వచ్చి పోలీసులమని బెదిరించారు. వారిలో ఒకడు ఆమె స్నేహితుడిని పట్టుకోగా మిగిలిన వారు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం పారిపోయారు. నిందితుల కోసం గాలించిన పోలీసులు వారిలో ఒకరిని కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

ఈ వార్తలను చదవండి

ఆ నోటీసులకు కారణం ఏంటి.. ఈసీకి సుప్రీం ప్రశ్న

డాక్టర్ నా కళ్లను తీసేశారు’.. మొబైల్‌ అవగాహన కార్యక్రమంలో చిన్నారుల్లో భయం!

Updated Date - Sep 23 , 2026 | 04:35 AM